ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

-

స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వస్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్ అంత్యక్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఉత్త‌ర ప్ర‌దేశ్ వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. అయితే.. ములాయం అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌ర్వాత అటు నుంచి అటే సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో ఇటీవ‌లే ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రాంతీయ కార్యాల‌యాన్ని ప‌రిశీలించారు సీఎం కేసీఆర్‌. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే సీఎం కేసీఆర్‌.

ఈ భ‌వ‌న నిర్మాణం పూర్తి అయ్యే దాకా కొత్త‌గా ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ కార్యాల‌యం కోసం స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లోని ఓ భ‌వ‌నాన్ని అద్దెకు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. బీఆర్ఎస్ ప్ర‌క‌ట‌న రోజే ఈ భ‌వ‌నానికి బీఆర్ఎస్ రంగులు అద్దారు. ఈ కార్యాల‌యాన్నే మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు సీఎం కేసీఆర్‌. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన త‌ర్వాత కేసీఆర్ ఢిల్లీకి రావ‌డం ఇదే తొలిసారి. ఈ ప‌ర్య‌ట‌న‌లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాల‌యంలో ఆయ‌న ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌ల‌తో పాటు మేథావుల‌తోనూ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ టూర్‌లో కేసీఆర్ ఎవ‌రెవ‌రిని క‌లుస్తార‌న్న విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version