రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు ఉదయం హెలికాఫ్టర్ లో నాచుపల్లి లోని జేఎన్టీయూ కు చేరుకుంటారు సీఎం కేసీఆర్. అక్కడి నుండి రోడ్డు మార్గాన కొండగట్టు కు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కొండపై గడపనున్నారు.
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ని కొండగట్టు ఆంజనేయ స్వామిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దర్శించుకొనున్నారు. బడ్జెట్ లో కొండగట్టు అంజయనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి 100 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేపు దేవాలయ పునర్నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. దేవాలయ అభివృద్ధి కి కావాల్సిన సలహాలు సూచనలు చేయనున్నారు. గత రెండు రోజుల క్రితం ప్రముఖ యాదాద్రి ఆర్కిటెక్ ఆనంద్ సాయి దేవాలయాన్ని పరిశీలించి నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి అధికారులతో కలిసి సమీక్ష చేయనున్నారు.
ముఖ్య మంత్రి పర్యటనకు సంబందించిన ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ ,ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పర్యవేక్షించారు. కొండగట్టు ఆలయానికి సంబందించిన పూర్తి వివరాలను రేపు ముఖ్యమంత్రికి తెలియజేయనున్నారు. రేపు ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు కు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రవి శంకర్. ముఖ్యమంత్రి పర్యటనకు పోలీసులు పూర్తి బందో బస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టు దేవాలయన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు.