22న యాదాద్రి ప‌ర్య‌ట‌న‌… సర్పంచ్ కి ఫోన్ చేసి చెప్పిన కేసీఆర్

-

ఈ నెల 22న యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి (మం), వాసాలమర్రిని దత్తత తీసుకున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు సిఎం కెసిఆర్. సీఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో వాసాలమర్రిలో కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పరిశీలించారు. యాదాద్రి పర్యటన నేపథ్యంలో వాసాలమర్రి గ్రామం సర్పంచ్ అంజయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు సీఎం కేసీఆర్. అంతేకాదు.. ఊరంతా సామూహిక భోజనం చేద్దామని సర్పంచ్ కి చెప్పిన కేసీఆర్… అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసుకొని.. గ్రామ సమస్యలపై చర్చిద్దామని సర్పంచ్ తో మాట్లాడారు.

దీనికోసం సామూహిక భోజన ప్రదేశం, గ్రామ సభ నిర్వహణకు పెద్ద ఖాళీ స్థలాన్ని చూడాలని సర్పంచ్ అంజయ్య సూచించారు సిఎం కేసీఆర్. కాగా ఇటీవలే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఎన్ వీ రమణ ఇటీవలే యాదాద్రి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఎన్ వీ రమణతో సహ సిఎం కెసిఆర్ కూడా యాదాద్రి రావాల్సి ఉండేది.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సిఎం కెసిఆర్ తన పర్యటన రద్దు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version