తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే నిన్న జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సీఎం కేసీఆర్.
ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో… యాదాద్రి అభివృద్ధి పై సమీక్ష, ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి చేరుకోనున్న కేసీఆర్.. సా.4:30 గంటలకు రాయగిరిలో కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో కూడా భారతీయ జనతా పార్టీ ని టార్గెట్ చేస్తూ.. మాట్లాడనున్నారు.
ఖబద్దార్ మోదీ..ఇాది తెలంగాణ పులిబిడ్డ..నీ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు అంటూ… సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిన్నటి జనగామ బహిరంగసభలో విమర్శించారు. నర్మెట్ట దగ్గర, జనగామ టౌన్ లో పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేము మంచివాళ్లం మిమ్మల్ని ఏం అనం.. కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.