గోదారి తలాపునే ఉన్నా.. ఖమ్మానికి నీళ్లిచ్చే ఆలోచన కాంగ్రెస్‌ చేయలేదు : కేసీఆర్

-

ఆలోచించలేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును నిర్మిస్తున్నదన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెచ్చ నాగేశ్వర్‌రావును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ వచ్చిన నాడు చాలా సమస్యలు ఉండే. కరెంటు సమస్యలు, తాగునీళ్లు లేవు. సాగునీరు అస్సలే లేదు. ప్రజలు బతుకేందుకు వలసపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. మహబూబ్‌నగర్‌లాంటి నుంచి 15లక్షల మంది బొంబాయి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పరిస్థితి. మెదక్‌, నల్గొండ జిల్లాల నుంచి వలసపోయి బతికిన పరిస్థితి ఉంది’ అంటూ గుర్తు చేశారు.

గోదావరి నది తరతరాలుగా ఉన్నది. గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టును పాత ఖమ్మం జిల్లాకు నీళ్లు సమృద్ధిగా ఇవ్వొచ్చు. కానీ, ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు ఆలోచించలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక సీతమ్మ సాగర్‌ నిర్మాణం జరుగుతున్నది. 75శాతం పనులు పూర్తయ్యాయి. ఒక సంవత్సరంలోగా పాత ఖమ్మంలోని పది నియోజకవర్గాలన్నీ సస్యశ్యామలమవుతుంది. ప్రగతి కాముకంగా, ప్రగతిశీలకంగా ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ పనులు చేస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version