ఇండియా కూటమిపై బీహార్‌ సీఎం కీలక వ్యాఖ్యలు

-

రానున్న రోజుల్లో మరికొన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో చేరే అవకాశం ఉందని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముంబయిలో జరగబోయే సమావేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరికొన్ని రాజకీయ పార్టీలు చేరే అవకాశం ఉందని బీహార్ నితీష్ కుమార్ తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన జేడీయూ నాయకుడు.. అయితే కూటమిలో చేరే అవకాశం ఉన్నవారి పేర్లను వెల్లడించలేదు.

అయితే సీట్ల పంపకం వంటి ఎన్నికలకు సంబంధించిన పద్ధతులపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ముంబయిలో జరగబోయే సమావేశంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల కోసం ఇండియా కూటమి వ్యూహాలను చర్చిస్తామన్నారు. సీట్ల పంపకం వంటి అంశాలు చర్చించబడతాయన్నారు. అనేక ఇతర అజెండాలు ఖరారు చేయబడతాయని నితీష్‌ స్పష్టం చేశారు. మరికొన్ని రాజకీయ పార్టీలు ఇండియా కూటమిలో చేరతాయన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు గరిష్ట సంఖ్యలో పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరుకుంటున్నామని.. ఆ దిశగానే పనిచేస్తున్నామన్నారు. తనకు ఎలాంటి కోరిక లేదన్నారు నితీష్ కుమార్.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీని సంయుక్తంగా ఎదుర్కోవడానికి ఏర్పాటైన 26-పార్టీల ప్రతిపక్ష కూటమి ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు సమావేశమైంది. ముందుగా జూన్ 23న పాట్నాలో, ఆపై జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో రెండు సార్లు సమావేశమైంది. ఈ కూటమి తమ మూడో సమావేశాన్ని ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో నిర్వహించనుంది.ఇదిలావుండగా,.. పాట్నాలోని బెయిలీ రోడ్‌లోని హర్తాలీ మోర్ సమీపంలో కొనసాగుతున్న లోహియా  పథ చక్ర నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. దుర్గాపూజలోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version