బియ్యం ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

-

జులై 20 నుంచి బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతిని కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తెల్లబియ్యాన్ని తప్పుగా వర్గీకరించి ఎగుమతి చేస్తుండడంతో కట్టడి చర్యలు చేపట్టింది. టన్నుకు 1200 డాలర్లు, ఆపై విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల కాంట్రాక్టులకు మాత్రమే రిజస్ట్రేషన్, అల్లోకేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని APEDAని కేంద్రం ఆదేశించింది. 1200డాలర్ల కంటే తక్కువ కాంట్రాక్టును నిలిపివేయొచ్చని సూచించింది.

ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. వచ్చే అక్టోబర్ 16 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ ఏడాది పలు రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం, ఆంక్షలు విధించి కేంద్రం. గతేడాది 74 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం విదేశాలకు ఎగుమతి చేశారు. దేశీయంగా ఉప్పుడు బియ్యం ధర రికార్డు స్థాయికి పెరిగిపోవడంతో.. దేశీయంగా అవసరాలకు సరిపడా బియ్యం స్టాక్ నిర్వహణ కోసం ఎగుమతిపై నిషేధం విధించింది.

విదేశాలకు ఉప్పుడు బియ్యం ఎగుమతిపై కేంద్రం సుంకం విధించడంతో పాకిస్థాన్, థాయిలాండ్ దేశాల్లో బియ్యం ధరలు పెరిగాయి. విదేశీ వ్యాపారులు సైతం ఇతర దేశాల నుంచి చౌకగా బియ్యం దిగుమతి చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 40 శాతానికి పై చిలుకే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version