మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో గుర్తుతెలియని అగంతకుడు చొరబడిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎంపీకి కాల్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయాన్ని డీకే అరుణ నిర్దారించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ఇంట్లో అగంతకుడు చొరబడిన విషయం తెలిసి సీఎం రేవంత్ రెడ్డి నాకు కాల్ చేశారు.
ఇంట్లో ఎలాంటి వస్తువులు ముట్టుకోకుండానే ఆగంతకుడు వెళ్ళిపోయాడు.నాకు ఎవరిపైనా అనుమానం కూడా లేదు.రాజకీయంగా నాపై కక్ష కట్టి ఎవరైనా పంపించారో తెలియదు.ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దర్యాప్తు పూర్తి అయితే పూర్తి స్పష్టత వస్తుంది.నాకు భద్రత పెంచమని ముఖ్యమంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు’ అని డీకే అరుణ వెల్లడించారు.