రన్యారావు పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మార్చి 03న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో రూ.12కోట్లు విలువైన బంగారంతో రన్యారావు పట్టుబడింది. రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఈ యవ్వారం పై బీజాపూర్ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ స్పందించారు.

రన్యారావు ప్రైవేట్ పార్ట్స్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రన్యారావు ఏఏ పార్టుల్లో బంగారం దాచింతో తనకు తెలుసు అని.. అలాగే ఈ స్మగ్లింగ్ లో మంత్రుల ప్రమేయం ఉందని ఆ విషయాలు అన్ని తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు. శాసనసభ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయటపెడతానని తెలిపారు. రన్యారావు తండ్రి రామచంద్రారావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి.. స్మగ్లింగ్ కి ఎలా సహకరిస్తారని నిలదీశారు. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల లోపాలు కూడా కనిపిస్తున్నాయని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news