ఆ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ ప్రత్యేక భేటీ

-

రాష్ట్రంలో ఇటీవల సీక్రెట్గా సమావేశమైన పది మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ రేపు మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ అవుతారని తెలుస్తోంది.

ఈ సమావేశంలో రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం పాల్గొంటారని సమాచారం. పది ఎమ్మెల్యేలను మొత్తం నాలుగు గ్రూపులుగా చేసి వారితో ఈ ముగ్గురు నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. కాగా, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. వీరు ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తారో అని జోరుగా ప్రచారం సాగింది. కాగా, ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్‌చార్జి మంత్రి వ్యవహారశైలి తీరుపై వీరంతా చర్చలు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version