పరిశ్రమలలో భద్రత పొల్యూషన్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వలన సమావేశం నిర్వహించలేకపోయాము.త్వరలో పరిశ్రమలో సమావేశం నిర్వహిస్తాము అని హోంమంత్రి అనిత అన్నారు. పరిశ్రమల్లో భద్రత పై హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రమాదం జరిగిన తరువాత సహాయక చర్యాలు వెంటనే చేపట్టే విధంగా పరిశ్రమలు సిద్ధంగా ఉండాలి.
ఇక కెజిహెచ్ ఘటన లో రౌడీ షీటర్ ను అరెస్టు చేసాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. కెజిహెచ్ ను త్వరలో సందర్శించి భద్రత పై సమీక్షిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో మరింత నిఘా పెంచేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అదేశించము. రౌడీ షీటర్ ల కదలికులపై దృష్టి పెట్టాము. గంజాయి పై ఉక్కు పదం మోపుతున్నాము. డ్రోన్స్ ద్వారా గంజాయి నిర్ములనకు చర్యలు తీసుకుంటున్నాము. గంజాయి తీసుకున్న, సరఫరా చేస్తున్న కఠిన చర్యలు తీసుకుంటున్నాము. పిడిఆక్ట్ నమోదు చేస్తున్నాము. అలాగే జైల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి అని అనిత అన్నారు.