భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే అర్చకులు సీతాసమేత శ్రీరాముల వారికి విశేష పూజలు చేస్తున్నారు. భద్రాచలం సన్నిధానం మొత్తం జై రామ్ నినాదాలతో మారుమోగుతున్నది.సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్దఎత్తున భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కొద్దిసేపటి కిందటే భద్రాద్రి రామయ్య సన్నధానానికి చేరుకున్నారు. శ్రీరాముల వారికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ నడుమ ఘనస్వాగతం పలికారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి ముందు సీఎం రేవంత్ భక్తులకు అభివాదం చేశారు.