అల్లుడి కోసం పేదల భూములు లాక్కుంటున్న సీఎం రేవంత్ : కేటీఆర్

-

అల్లుడి కోసం సీఎం రేవంత్ రెడ్డి పేద, గిరిజన రైతుల భూములు లాక్కుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లగచర్లలో తొమ్మిది నెలలుగా దళిత, గిరిజన రైతులు ఆందోళనలు చేస్తున్నారని, వారిని కలిసి సమస్యలు వినేందుకు రేవంత్‌కు సమయం దొరకడం లేదని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే సోమవారం లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి రైతులను కలిసేందుకు టైమ్ లేదు కానీ, ఢిల్లీకి వెళ్లేందుకు మాత్రం క్యూ కడుతున్నారన్నారు. ఆయన సొంత సెగ్మెంట్‌లో సీఎం తిరుగుబాటు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.

సొంత అల్లుడి కోసం సీఎం పేదల భూములు లాక్కున్నాడని ఆరోపించారు. అదానీ, అల్లుడు, అన్నాదమ్ముళ్ల కోసమే రేవంత్ పనిచేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. రేవంత్‌కు మహారాష్ట్ర ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారన్నారు. తనను రాళ్లతో కొడతామని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని, వారిపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.గతంలో మానుకోట రాళ్ల దాడి నుంచే నిప్పు పుట్టిందని గుర్తుచేశారు. ఆ నిప్పు నుంచే తెలంగాణ వచ్చిందన్నారు. నేడు లగచర్లలో జరిగింది.. రేపు రాష్ట్రంలో ఇంకెక్కడైనా జరుగొచ్చని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version