తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు పాలన మీద పట్టులేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. గతంలో అనుమతులు లేకుండా కట్టుకున్న ఇండ్లకు రెగ్యులర్ చేసుకోవడానికి మాజీ సీఎం కేసీఆర్ సాయం చేసిందని, జీవో 58, 59 కూడా ఇచ్చినట్లు గుర్తుచేశారు.
కానీ,ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక కట్టిన ఇండ్లు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి, మంత్రులకు పరిపాలన మీద పట్టు ఉందా? లేదా?
అని అడిగారు. మంత్రులు అసలు పని చేస్తున్నారా? లేదా? అధికారులు మంత్రులు చెప్పినట్టు విని ఇండ్లు కూలగొడుతున్నారా? సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా? అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు.