త్వరలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలవుతాయని…రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని పరిశీలించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ..అనంతరం మాట్లాడారు. 65 వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్ లుగా విస్తరించాలనేది నా కల అన్నారు. విస్తరణ తర్వాత యాక్సిడెంట్ ఫ్రీ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.
బీఆర్ఎస్ చేసిన మోసం వల్లే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 50 వేలకు పైగా మెజారిటీ, ఎంపీలు దేశంలోనే రికార్డు మెజారిటీతో గెలిచారని గుర్తు చేశారు. 10 సంవత్సరాలు పాలించి.. వందేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారని వెల్లడించారు. త్వరలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని పార్టీలు తెర మరగయిపోతాయని వివరించారు. పాదయాత్రకు కేటీఆర్ రెడీ అవుతున్నారు. అయితే.. ఈ తరుణంలో మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ను ధర్నాలు దీక్షలు, పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మబోరని చురకలు అంటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రైతు ధర్నా చేసే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు.