సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు.గతంలో హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్‌తోనూ ఆడిన ఆయన.. గురువారం మంచిరేవులలో కొత్తగా నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన అనంతరం పిల్లలతో కలిసి సరదాగా సాకర్ ఆడారు.
మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్‌లో ఈ స్కూల్ నిర్మాణం జరగగా.. అధికారులతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణ శైలిని సీఎం పరిశీలించారు. సైనిక్ స్కూల్ తరహాలో నిర్మించిన ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో పుట్‌బాల్ గ్రౌండ్‌ను సీఎం రేవంత్ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం వెంట మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.