మాజీ సీఎం వైఎస్ జగన్‌పై CPI నారాయణ సెటైర్లు వేశారు. పోలీసుల బట్టలూడదీసి జగన్ ఏం చూడాలి అనుకుంటున్నాడు?అని ప్రశ్నించారు. గురువారం మీడియాతో నారాయణ మాట్లాడుతూ.. ‘వాళ్ల బట్టలు ఊడదీసి జగన్ ఏం చేస్తాడు? ఏం చూడాలి అనుకుంటున్నారు? జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు ఆయనకు చప్రాసి లాగా పని చేశారు.
వైఎస్ జగన్ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో జగన్ పోలీసులను వాడుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మాజీ సీఎంని అరెస్ట్ చేయించారు. అధికారులు కూడా ట్రాన్స్ఫర్ లకు భయపడి రాజకీయ నాయకులు చెప్పినట్లు చేయకూడదు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు విమర్శలు చేశారు.