హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రతిపాదనకు సంబంధించిన డీపీఆర్, ట్రాఫిక్‌పై అధ్యయనం తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.ప్రస్తుత పరిస్థితి, మెట్రోలైన్ పొడిగింపు, రెండోదశపై అధికారులతో
మియాపూర్-పటాన్చెరు, రాయదుర్గం-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,ఎల్బీనగర్-హయత్‌నగర్,ఎంజీబీఎస్-ఎయిర్‌పోర్టు మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పాతబస్తీ మెట్రోపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మతపరమైన, చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా మెట్రో విస్తరణ చేపట్టాలన్నారు. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.