Yatra 2 : యాత్ర 2 టీజర్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది.. ఎప్పుడంటే..?

-

దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో తమిళ నటుడు జీవ వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నటువంటి తాజా చిత్రం యాత్ర 2. ఇదివరకే 2019 ఎలక్షన్స్ కి ముందు యాత్ర సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రము మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వల్ గా ఎన్నికల ముందు యాత్ర 2 ను తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల అయినాయి. ఈ సినిమా టీజర్ ని జనవరి 5న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రం వెల్లడించింది.

ఇక ఈ అప్డేట్ ఇస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో వైస్సార్‌లా మమ్ముట్టి కుర్చీలో కూర్చొని కనిపిస్తే, ఆయన పక్కనే జీవా జగన్ పాత్రలో ఒదిగిపోయారు.

ఇదిలా ఉంటే… ఈ మూవీని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి మరణం ముందు, తర్వాత జగన్ పరిస్థితులు, ఆ తరువాత జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అనే విషయాలను ఈ చిత్రం లో చూపిస్తున్నారు. అలాగే ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ మూవీ మాత్రం ఇప్పుడు విడుదల అవ్వడానికి చాలా కష్టపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version