అరవై ఏళ్ల పోరాటం తర్వాత సోనియా గాంధీ వలన తెలంగాణ వచ్చింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎంతగానో గౌరవిస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేను సోనియా గాంధీకి ఓటు వేయాలని అభ్యర్థించాను. కాంగ్రెస్ కార్యకర్తగా సోనియా గాంధీ పేరుతో నేను ఓట్లు అభ్యర్థించా… జాతీయ నాయకులను రంగంలో ఉంచితేనే అంత పెద్ద మొత్తంలో ఓట్ల శాతం సాధించగలం. అయితే కాంగ్రెస్ లోకల్ నాయకలు ఎంతగానో కష్టపడతారు.
కాంగ్రెస్ క్యాడర్ లోకల్ లీడర్ పేరుతో ఓట్లు అడుగుతారు. స్థానిక నాయకులు గట్టిగా పని చేసి జాతీయ నాయకత్వం పేరుతో ఓట్లు అడగాలి. అప్పుడే ప్రజలు ఓట్లు వేస్తారు. అలాకాకుండా మీరు రేవంత్ రెడ్డికి ఓట్లు వేయమంటే.. ఆయన రెడ్డి.. ఆయనది అగ్ర కులం. అంటారు. బీసీ.. ఎస్సీ రకరకాల భావనలు సృష్టిస్తారు. అదే మీరు జాతీయ నాయకత్వం పేరుపై ఓట్లు అడిగితే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ భావనలే రావు. ఇది నా పరిశీలన. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశగా ఆలోచించాల్సి ఉంది అని సీఎం పేర్కొన్నారు.