జపాన్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారిటా ఎయిర్‌పోర్టుకు రేవంత్ బృందం చేరుకుంది. ఈ నెల 22 వరకు జపాన్ పర్యటనలో రేవంత్ ఉందనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగనుంది.
- ఇవాళ రాత్రి జపాన్ పర్యటనకు బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి
- రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి ఏప్రిల్ 16 నుంచి 22 వరకు జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి
- ఏప్రిల్ 18న జపాన్ చేరుకొనున్న మంత్రి శ్రీధర్ బాబు
- టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హీరోషిమాలో సీఎం రేవంత్ బృందం పర్యటన
- ఓసాకా వరల్డ్ ఎక్స్పో 2025 లో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ బృందం
- జపాన్ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశం
- రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు