ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళా యూట్యూబర్

-

ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను ఓ మహిళ దారుణంగా హతమార్చింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. హర్యానా రాష్ట్రంలోని భివానీకి చెందిన యూట్యూబర్ రవీనా(32), ప్రవీణ్ (35) భార్యభర్తలు.

అయితే, గత కొంత కాలం కిందట రవీనా.. తన కంటే వయసులో చిన్నవాడైనా సురేష్(25)తో ప్రేమలో పడింది. అది కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింద. అయితే, గత నెల 26న వీరిద్దరూ కలిసి ఏకాంతంగా, అభ్యంతరకర స్థితిలో ఉన్నప్పుడు భర్తకు పట్టుబడ్డారు.ఈ క్రమంలోనే తన భర్తను.. రవీనా ప్రియుడితో కలిసి గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి మురుగు కాల్వలో పడేశారు. హత్యపై పోలీసులు విచారణ చేపట్టగా..నిందితులు దర్యాప్తులో నేరాన్ని అంగీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news