మహారాష్ట్ర ఎన్నికలకు స్టార్ క్యాంపెనర్‌గా సీఎం రేవంత్ రెడ్డి

-

వచ్చే నెలలో మహారాష్ట, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఖాళీ అయిన రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలకు సైతం నవంబర్ 20వ తేదిన పోలింగ్ జరగనుంది. ఇక మహారాష్ట్రకు సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనుండగా.. జార్ఖండ్‌కు మాత్రం రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్లను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.

అయితే, మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియామకం అయ్యారు. కాంగ్రెస్ చీఫ్ మల్లీకార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం ఆ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. కాగా, ఇటీవల జరిగిన హర్యానా, జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version