కరీంనగర్ పట్టభద్రుల సభలో సీఎం రేవంత్ కీలక కామెంట్స్..!

-

కరీంనగర్ పట్టభద్రుల సంకల్ప సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. కరీంనగర్ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆనాడు సోనియమ్మ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారు. పీవీ నరసింహరావు లాంటి ఎంతోమందిని అందించిన ఘనత ఈ గడ్డకు ఉంది. ఈ గడ్డ రాజకీయ చైతన్యానికి మారుపేరు. కరీంనగర్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత జీవన్ రెడ్డి గారిది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆరెస్ నేతలు కేసీఆర్, హరీష్, కేటీఆర్ పిలుపునిస్తున్నారు. ఎవరైనా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇతర పార్టీ అభ్యర్థులను ఓడించాలని ప్రచారం చేస్తారు. కానీ.. ఏ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ ను ఓడించాలని కెసిఆర్, హరీష్, కేటీఆర్ చెబుతున్నారు. మీ అభ్యర్థి ఎవరు అని మేం ప్రశ్నిస్తున్నాం. మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు ఓట్లు ఎవరికి వేయాలని మీరు ప్రచారం చేస్తున్నారు. BRS, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ ను ఓడించాలని ప్రచారం చేస్తున్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో సాగిలపడుతున్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని బీరాలు పలుకుతున్నవాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు అని ప్రశ్నించారు రేవంత్.

Read more RELATED
Recommended to you

Latest news