Ac రూమ్ నుండి బయటికి రావడానికి IAS, IPSలు ఇష్ట పడటం లేదు : సీఎం రేవంత్

-

IAS ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ లో మాజీ IAS గోపాలకృష్ణ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 6 దశాబ్దాల జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకుని రావడం బిగ్ టాస్క్. కొత్తగా IASగా వచ్చే వాళ్లకు గోపాలకృష్ణ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మందికి కొంత మంది సీనియర్ IASల గురించి ఇప్పటికి తెలీదు. శేషన్ IAS.. ఎన్నికల కమిషన్ ఉంది అని తట్టి లేపిన గొప్ప వ్యక్తి.

రాజకీయ నాయకులను గైడ్ చేసే విధానం అప్పట్లో ఉండేది.. ఇప్పుడు ఎందుకు అట్లా లేదో తెలియడం లేదు. రాజకీయ నాయకులకు అవహగన కల్పించే సెక్రెటరియేట్ రూల్స్ ఉన్నాయి. కొత్తగా సెలెక్ట్ అయిన IASలు తప్పుడు మార్గంలో ఉంటున్నారు. కొత్త IPS లు యూనిఫామ్ వేసుకొని సివిల్ పంచాయితీ లు చూసుకుంటున్నారు. Ac రూమ్ నుండి బయటికి రావడానికి IAS, IPSలు ఇష్ట పడటం లేదు. జనం లోకి రండి అంటే రావడం లేదు. అధికార ఆలోచన విధానం లో మార్పు రావాలి. నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఎక్కడ ఉన్నా పోస్టింగ్లు వస్తాయి అని సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version