దళితుల జోలికి వస్తే చర్యలు కఠినంగా ఉంటాయి : ఎమ్మెల్యే రాజు

-

వైసీపీ నాయకులు హంద్రీనీవా లైనింగ్ పనులు అడ్డుకుంటాం అంటున్నారు అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. చివరి ఆయకట్టుకి నీరు చేరాలంటే లైనింగ్ అవసరం. అన్ని చెరువులకు నీరు ఇవ్వాలి అంటే లైనింగ్ అవసరం. మడకశిర చివరి ఆయకట్టు కి నీరు రావాలి. ఐదేళ్ల లో హంద్రీనీవా నుంచి ఒక్క చుక్క రాప్తాడుకి నీరు తీసుకురాలేదు. గత ప్రభుత్వం లో లైనింగ్ కోసం టెండర్ పిలిచారు పనులు చేయలేదు. గతం లో ఉరవకొండ లో జగన్ దీక్ష చేశారు. మా ప్రభుత్వం వస్తే హంద్రీనీవా పూర్తి చేస్తాం అని చెప్పారు.

ఒక్క అడుగు పని ముందుకు పడలేదు… సీఎం గా ఒక్క ప్రాజెక్టు సందర్శించిన దాఖలాలు లేవు. ప్రాజెక్టులను నాశనం చేసిన ప్రభుత్వం లైనింగ్ అడ్డుకుంటాం అనడం శోచనీయం. ఉమ్మడి జిల్లా లో ప్రతి చెరువుకు నీళ్లు అందిస్తాం. అధికారం లో లేనప్పుడు రైతుల పై ప్రేమ నటిస్తూ మోసం చేయాలని చూస్తున్నారు. జగన్ సీఎం హోదాలో ఒక్క ప్రాజెక్టు పైన అయినా సమీక్ష నిర్వహించారు. కుప్పం లో నీళ్లు రిలీజ్ చేసినట్లు గతం లో డ్రామాలు ఆడారు. వంశీ వ్యవహారం లో కక్ష్య సాధింపు చర్య అంటున్నారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతోంది. కక్ష్యతో వెళితే కొడాలి, పేర్ని నానిలు, జోగి రమేష్ వంటి వారు ఎప్పుడో జైల్ కి వెళ్లే వారు..నిందితులను చట్టం ప్రకారమే శిక్షిస్తారు. ఓ దళితుడిని బెదిరించిన చర్యల్లో అతన్ని అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం హయం లో దళితుల జోలికి వస్తే చర్యలు కఠినంగా ఉంటాయి అని ఎంఎస్ రాజు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version