నేడు భారత దేశ తొలి ఉపప్రధాని, ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి చేశారు. సర్దార్ పటేల్‌కు నివాళులు అర్పించిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు ఉన్నారు.
దేశ సమగ్రత, సమైక్యతకు సర్ధార్ పటేల్ చేసిన కృషిని వారంతా స్మరించుకున్నారు.ఇదిలాఉండగా, సర్దార్ పటేల్ కృషి వల్లే హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో భాగం అయ్యిందని అందరికీ తెలిసిందే. ఇండియన్ ఆర్మీని పంపించి నిజాం రాజును బెదిరించి హైదరాబాద్‌ను దేశంలో భాగం అయ్యేలా చేశారు.