చాలా మంది రాత్రిపూట నిద్రపోతూ ఉంటారు. కానీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. పడుకున్న వెంటనే నిద్ర పోవాలంటే ఖచ్చితంగా ఇలా చేయండి. ఒత్తిడి వివిధ రకాల కారణాల వలన నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిద్రలేమి వలన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. చాలామంది నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారు పడుకున్న వెంటనే నిద్ర పోవాలంటే ఖచ్చితంగా కొన్నిటిని ఫాలో అవ్వండి. నిద్రలేమి సమస్యని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అది ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.
నిద్రలేమి ఉన్నవాళ్లు ఆలస్యంగా తినొద్దు. త్వరగా భోజనం చేసేయాలి. పడుకునే ముందు మొబైల్ ఫోన్లకు, టీవీలకు ఇతర స్క్రీన్ కి దూరంగా ఉండండి. అలా స్క్రీన్లకి దూరంగా ఉంటే నిద్ర బాగా పడుతుంది. ఎలాంటి ఇబ్బంది రాదు. రాత్రిపూట పాలు తాగితే కూడా నిద్రపోవడానికి అవుతుంది. పడుకోవడానికి ముందు కాసేపు వాకింగ్ చేస్తే కూడా బాగుంటుంది. వాకింగ్ చేయడం వలన అలసిపోతారు కాబట్టి వెంటనే నిద్ర పడుతుంది.
ఈ పనులు అన్ని చేసినా మీకు నిద్ర రాకపోతున్నట్లయితే మానసిక స్థితి బాలేదని అర్థం చేసుకోవాలి. ఈ పనులన్నీ చేయడంతో పాటుగా కాసేపు మ్యూజిక్ నిద్రపోవడానికి ట్రై చేయండి. ఇది కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది నిద్రపోవడానికి పసుపు పాలు కూడా తీసుకోవచ్చు. రాత్రి నిద్రపోవడానికి ముందు పసుపు పాలని తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. హాయిగా నిద్రపోవచ్చు. రాత్రిపూట ఆహారాన్ని హెవీగా తీసుకోవడంతో పాటుగా కారం, మసాలా ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే నిద్ర సరిగా పట్టదు. కాబట్టి ఇటువంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి.