ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెలలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు అధికారులు సీఎం పర్యటన కోసం షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఏప్రిల్ 15 నుంచి 24వరకు ముఖ్యమంత్రి జపాన్‌లోనే పర్యటించనున్నారు. సీఎం తన పర్యటనలో భాగంగా ఒసాకాలో జరగనున్న ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో పాల్గొంటారని తెలుస్తోంది.
రాష్ట్రంలో పెట్టుబడులపై వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు.జపాన్ పర్యటనకు సీఎంతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులు వెళ్లనున్నారు. కాగా, ప్రస్తుతం సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.కేబినెట్ విస్తరణతో పాటు, ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.