గుంటూరులో పోలీసులపై ప్రజల తీవ్ర ఆగ్రహం

-

గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం శాంతినగర్‌లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ కమిటీ హాల్ స్థలం విషయంలో చిన్నికృష్ణ అనే వ్యక్తి కుటుంబానికి, గ్రామస్థులకు మధ్య వివాదం నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఈ గొడవను సర్దుమణిగించడానికి ప్రయత్నించారు.

అది కాస్త ముదరడంతో ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోన ఆ తతంగాన్ని వీడియో తీస్తున్న యువకుడికి గాయాలు అయ్యాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసుల కారుపై రాళ్లు రువ్వారు. అద్దాలు ధ్వంసం చేశారు. సీఐ క్షమాపణ చెప్పాలని రహదారిపై టైర్లు తగలబెట్టి రాస్తారోకో నిర్వహించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news