సీఎం రేవంత్ రెడ్డి..కీలక నిర్ణయం తీసుకున్నాడు. నేడు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోనున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు మహా గణపతిని దర్శించుకుని పూజలు చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు గణనాథుడిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, సురేఖ దర్శించుకోనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇది ఇలా ఉండగా…గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు. హుస్సేన్ సాగర్ తో పాటు GHMC పరిధిలోని 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 30 వేల మందితో పోలీసు బందోబస్తు కూడా ఉంచారు. సీసీ కెమెరా సర్వైలెన్స్, డ్రోన్లతో పర్యవేక్షణ ఉంటుంది. హుస్సేన్ సాగర్ లో 9 బూట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటేషన్ సిబ్బంది నియామకం చేశారు. 303 కి.మీ మేర 50 వేల విగ్రహాల శోభాయాత్రలు జరుగుతాయని అంచనా వేశారు.