మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ధోని తనదైన ఆట తీరుతో టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలను అందించారు. అంతేకాకుండా క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టే వారిని ధోని ఎంతగానో ప్రోత్సాహిస్తాడు. ఇదిలా ఉండగా… ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ధోని మరో సంవత్సరం పాటు ఐపీఎల్ ఆడవచ్చని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.

ఎన్. శ్రీనివాసన్ తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ పగ్గాలు తీసుకున్నారని ధోనితో అతనికి చాలా మంచి బాండింగ్ ఉందని తెలిపాయి. మరో సీజన్ కూడా ఆడాలని శ్రీనివాసన్ ధోనిని ఒప్పించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా 44 ఏళ్ల ధోని గత సీజన్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఆడారు. ఇక ధోని వచ్చే సీజన్ ఐపిఎల్ లో తన ఆటను కొనసాగిస్తారా లేదా అనేది అతడి ఫిట్నెస్ పై ఆధారపడి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధోని ఐపిఎల్ లో ఆడాలని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.