రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

-

అర్హులందరికీ రైతుభరోసా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ‘జాతీయ రహదారులకు, శ్రీమంతులకు రైతుభరోసా నిధులు వస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ సంక్షేమం సామాన్యులకు చేరాలి. ఇందుకోసం మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటు చేశాం. జులై 15 కల్లా నివేదిక వస్తుంది. బడ్జెట్ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టి రైతుభరోసా విధివిధానాలు నిర్ణయిస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘మే 6, 2022న వరంగల్ రైతు డిక్లరేషన్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో రుణమాఫీ కింద 2 విడతలుగా రూ. 16వేల కోట్లు, రూ.12వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసింది. కానీ మేం ఒకేసారి 48 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news