కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని చెప్పారు తెలిపారు. హైకోర్టు చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారని.. కేసీఆర్ చిత్తశుద్ధిని గుర్తించి కృష్ణా పరివాహక ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు.
“కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను. కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోంది. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం. బేసిన్‌లు లేవు భేషజాలు లేవని కేసీఆర్ అన్నారు. అక్కడే ఆయన కమిట్‌మెంట్ ఏంటో తెలిసిపోతోంది. కృష్ణా బేసిన్‌లో బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారు. మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించాం. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నాం. విధానపర లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.