గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పుట్టినరోజు సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో అఫీషియల్ ‘ఎక్స్’ అకౌంట్ ద్వారా ఈ విధంగా రాసుకొచ్చారు. ‘గోషామహల్ శాసనసభ్యులు టి.రాజా సింగ్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.
నిత్యం ప్రజాసేవలో నిమగ్న మవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు’. ఇదిలాఉండగా, ఎమ్మెల్యే రాజా సింగ్ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.