జనగణన తర్వాత కేంద్రం ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేయనుందని, ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గిపోనుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు.జనాభా దామాషా ప్రకారం కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే సమానంగా సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఆయన దక్షిణాది రాష్ట్రాల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శనివారం చెన్నెలో డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల రాజకీయ పార్టీల డీలిమిటేషన్ వ్యతిరేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవ్వగా.. ఆయనకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వాగతం పలికారు. కాగా, సీఎం రేవంత్ కూడా ఈ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే.