బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. చేశారు. నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేనని బాంబ్ పేల్చారు బండి సంజయ్. ఇస్తే వద్దనను.. అధ్యక్షుడిగా ఇప్పటికే నేనేంటో నిరూపించుకున్నానని ప్రకటించారు. కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని ఆగ్రహించారు.. కార్యకర్తలను కన్య్ఫూజ్ చేయవద్దని కోరారు బండి సంజయ్. పార్టీ పెద్దలు అధ్యక్షుడ్ని నిర్ణయిస్తారు.. నేను కేంద్ర సహాయమంత్రిగా ఉన్నానన్నారు బండి సంజయ్. నియోజకవర్గ పునర్విభజన పై మీటింగ్ పెట్టుకున్న వారు దొంగల ముఠానేనని… డీఎంకె పెట్టిన మీటింగ్ కి కాంగ్రెస్, బిఅర్ఎస్ కలిసి వెళ్ళారని ఆగ్రహించారు. డిలిమిటేషన్ ప్రాసెస్,నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని తెలిపారు.