మైనార్టీలు సురక్షితంగా ఉండేది మన దేశంలోనే: యోగి

-

మైనార్టీలు సురక్షితంగా జీవిస్తున్న దేశమేదైనా ఉందంటే అది భారత్ మాత్రమేనని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హిందువులు మెజార్టీగా ఉన్నప్పటికీ భారత్ సెక్యులర్ దేశం అనే సంగతి మర్చిపోకూడదని, ప్రతి ఒక్కరి భద్రతకూ ఇక్కడ భరోసా ఉంటుందని చెప్పారు. బలవంతంగా, అనైతికంగా మత మార్పిడి చేయాలనుకునే వాళ్లు ఆ పని మానుకోవాలని హెచ్చరించారు. అందరూ సనాతన ధర్మాన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పాకిస్థాన్, అప్ఘనిస్థాన్‌లోని మైనార్టీల దుస్థితి గురించీ ప్రస్తావించారు.

చాలా దేశాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో పరిశీలించాలని సూచించారు యోగి ఆదిత్యనాథ్. మైనార్టీలపైనా అక్కడ దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌లలో మైనార్టీల ఆధ్యాత్మిక క్షేత్రాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు అనవసరమైన కామెంట్స్ చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. అంతకు ముందు మత మార్పిడిపైనా మాట్లాడారు యోగి. బలవంతంగా, అనైతికంగా మత మార్పిడి చేయాలనుకునే వాళ్లు ఆ పని మానుకోవాలని హెచ్చరించారు. అందరూ సనాతన ధర్మాన్ని ఆచరించాలని సూచించారు. సనాతన ధర్మం ఆచరిచండాన్ని అందరూ గర్వంగా భావించాలని, హిందూ ధర్మం ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైందని మానవత్వమే దానికి మూలాలు అని చెప్పారు. రోజురోజుకీ దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటోందని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version