తెలంగాణ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ఫండ్ విడుదలలో కొత్త రికార్డును సృష్టించింది. కేవలం ఏడాదిలోగా రూ.830 కోట్ల సాయాన్ని ప్రజలు సీఎం సహాయనిధి నుంచి పొందారు.దీనిపై తాజాగా కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్‌పై విరుచుక పడ్డారు. నాటి బీఆర్ఎస్ దొంగల పాలనకు నేటి ప్రాజా పాలనకు ఉన్న తేడాకు ఇదే నిదర్శనం అని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్‌ను కూడా దిగమింగారని.. అవినీతి పందికొక్కుల పాలనకు కేరాఫ్ అన్నారు. నేడు సీఎంఆర్ఎఫ్‌లో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకతతో పుట్టు చెవుడు, మూగ పిల్లల జీవితాల్లో వెలుగునిస్తూ..పేద గుండెలు కాపాడే ఇంటి పెద్దన్న బాధ్యతను చూస్తున్నట్లు సామా రామ్మోహన్ అన్నారు. కాగా, గతంలో సగటున ఏడాదికి రూ.480 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద విడుదల చేయగా..కాంగ్రెస్ పాలనలో ఈ ఏడాదికి రూ. 830 కోట్ల బాధితులు చెక్కుల రూపంలో అందుకున్నారు.