తెలంగాణ తల్లి విగ్రహా విష్కరణకు రండి.. కేంద్రమంత్రికి పొన్నం ఆహ్వానం

-

ఈనెల 9వ తేదీన రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తుది మెరుగులు దిద్దిన విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సచివాలయంలో జరిగే ప్రజాపాలన విజయోత్సవాలు ముగింపు వేడుకలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.

శనివారం రాజ్‌భవన్ దిల్ కుశా అతిథి గృహంలో ఉంటున్న కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణ ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్,ప్రోటోకాల్ అధికారి వెంకట్ రావు, హైదరాబాద్- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరయ్యారు. కాగా, పత్తాలు, పట్టింపులు లేకుండా ఎటువంటి బేషజాలకు పోకుండా పార్టీలకతీతంగా ఈ వేడుకలకు హాజరవ్వాలని మంత్రి పొన్నం ప్రతిపక్షాలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news