తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ఠ్. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భూకంపం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భూమి కంపించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో భూ ప్రకంపనలు రావడంతో జనాలు భయాందోళనతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
కాగా, భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. ఇటీవల హైదరాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా మొన్నటి బుధవారం ఉదయం భూమి కంపించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైంది. ములుగు జిల్లా కేంద్రంగా స్వల్ప భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రకంపనలు గోదావరి నది పరివాహ ప్రాంతాల్లోనే అధిక తీవ్రత చూపినట్లు సమాచారం.