కూంబింగ్ లో మిస్ ఫైర్.. కమాండో మృతి !

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో కమాండెంట్ మృతి చెందిన ఘటన గత రాత్రి చోటు చేసుకుంది. చర్ల మండలంలోని చత్తీస్ గడ్ సరిహద్దులో ఉన్న చెన్నా పురం అటవీ ప్రాంతంలోమావోయిస్టుల కోసం గత రాత్రి కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్ కోసం వెళ్లిన బెటాలియన్ కు చెందిన కమాండెంట్ ఆదిత్య తుపాకి మిస్ ఫైర్ అయ్యింది. ఆయన తీవ్రంగా గాయపడడంతో హుటుహుటిన చర్ల ఆసుపత్రికి తరలించారు.

అయినప్పటికి ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. మిస్ ఫైర్ వల్ల ఆదిత్య మృతి చెందినట్లు జిల్లా ఎస్ పి సునీల్ దత్ ప్రకటించారు. చర్ల మండలంలో ఇటీవల కాలంలో మావోయిస్టులు మందు పాతర పేల్చడం, ఆ తరువాత మావోయిస్టులు ఇద్దరు పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఈనేపద్యంలో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతుంది. కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసు అధికారి మృత్యు వాత పడడం పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.