ఆ ఏపీ మంత్రి చేసిన ప‌నికి ప్ర‌శంస‌లే ప్ర‌శంస‌లు…

-

ఆయ‌న మంత్రి. దారెంట పోతున్నారు. అంత‌లో స‌డ‌న్‌గా రోడ్డు ఆక్సిడెంట్ అయింది. ఏమీ చేయాలో అంద‌రికి పాలుపోవ‌డం లేదు. కానీ మంత్రి మాత్రం ఏమాత్రం త‌ట‌ప‌టాయించ‌కుండా కారులోంచి దిగారు. దిగ‌డంతోనే ఏమాత్రం చేయ‌కుండా ఆప‌ని కానిచ్చేశారు. ఇంత‌కు ఏ మంత్రి.. ఏ ప‌ని.. అనుకుంటున్నారా..? ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డవారికి సాయం చేసి  మానవత్వాన్ని చాటుకున్నారు. సంఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే కాకినాడ గ్రామీణం తూరంగి వద్ద  శ్రీ చైతన్య పాఠశాల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పై వంతెన పిల్లర్‌ను ఢీ కొట్టింది.

అదే స‌మ‌యంలో ఆ ప్రాంతంలో ద్విచక్ర వాహనాల వాహానాలు వ‌చ్చాయి. బ‌స్సు వంతెన‌పై పిల్ల‌ర్‌ను ఢీకొట్టి అక్క‌డే ఆగిపోయింది. అయితే ద్విచ‌క్ర వాహానాల‌పై  వెళ్తోన్న నలుగురు కూడా నియంత్రణ కోల్పోయి పడిపోవడంతో గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన వారు అక్క‌డే ఇబ్బంది ప‌డుతున్నారు.  అదే సమయంలో మంత్రి  కురసాల కన్నబాబు కాకినాడ నుంచి తూరండి మీదుగా అమరావతి వెళుతున్నారు. ఈ ప్రమాదాన్ని చూసి ఛ‌లించిపోయారు. వెంట‌నే  తన కాన్వాయ్‌ ఆపి తానే స్వ‌యంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

త‌న వెంట ఉన్న‌వారు సాయం ప‌ట్ట‌డంతో  గాయాలపాలైన వారిని మరో వాహనంలోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అయితే వంతెన‌పై పిల్ల‌ర్‌ను ఢీ కొట్టిన బ‌స్సుకు ఎలాంటి ప్ర‌మాదం జ‌రుగ‌లేదు. కానీ శ్రీ చైత‌న్య  పాఠశాల బస్సులో దాదాపు 100 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులంతా  క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాను మంత్రి అయి ఉండ‌కుండా ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా గాయ‌ప‌డిన వారిని వెంట‌నే చికిత్స‌కు పంపించి త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. మంత్రి చేసిన ఈ ప‌నికి ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version