దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ కి దూరమవుతున్నాడా..? దూరం చేస్తున్నారా..?

-

దేవిశ్రీ ప్రసాద్ అలియాస్ డీఎస్పీ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ దేవీ. టాలీవుడ్‌లో ఈ పేరుకో బ్రాండ్ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా టాప్ మ్యూజిక్ డైరక్టర్‌గా ఆయన చలామణి అవుతున్నారు. ఒక‌ప్పుడు ఏ స్టార్ హీరో సినిమా వ‌చ్చినా మ్యూజిక్ మాత్రం దేవినే ఇచ్చేవాడు. స్టార్ హీరోలు సైతం త‌మ సినిమాల‌కు దేవినే మ్యూజిక్ ఇవ్వాల‌ని ఖ‌రాఖండీగా చెప్పేవారు. అయితే గ‌త యేడాది కాలంగా దేవి సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయ్యింది. గ‌తంలో రెమ్యునరేషన్ ఎక్కువైనా దర్శకనిర్మాతలు కూడా చాలామంది అతడివైపే మొగ్గుచూపేవారు.

ఇక దేవి గ్రాప్ క్ర‌మ‌క్ర‌మంగా ప‌డిపోతోంది. త‌న మ్యూజిక్ తానే రిపీట్ చేస్తున్నాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. పలువురు దర్శకులు కూడా ఆయనను దూరం పెడుతున్నారు. తాజాగా కిశోర్ తిరుమల కూడా దేవీని దూరం పెట్టాడు. దేవి బిహేవియ‌ర్ కూడా ఇందుకు ఓ కార‌ణ‌మ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ దేవిని ప‌క్క‌న పెట్ట‌గా తాజాగా తిరుమ‌ల కిషోర్ త‌న రెడ్ సినిమాకు మ‌ణిశ‌ర్మ‌ను తీసుకోవ‌డం విశేషం.

తిరుమ‌ల కిషోర్ డైరెక్ట్ చేసిన‌ ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘చిత్రలహరి’ చిత్రాలకు దేవీతో పనిచేశాడు. మ్యూజికల్‌గా మాత్రం అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు దేవిని ప‌క్క‌న పెట్టి ఏకంగా సీనియ‌ర్ అయిన మ‌ణిశ‌ర్మ‌ను తీసుకున్నాడు. ఇక తిరుమ‌ల కిషోర్ మాత్ర‌మే కాదు… గ‌తంలో దేవితో వ‌రుస‌గా ప‌నిచేసిన పలువురు దర్శకులు ఆ తరువాత అతడికి దూరం అవుతూ వచ్చారు. ఈ లిస్ట్‌లో శ్రీనువైట్ల, త్రివిక్రమ్ ఉన్నారు.

వ‌రుస‌గా దేవీతో ప‌నిచేసిన కొర‌టాల ఇప్పుడు చిరు సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను తీసుకుంటున్నాడ‌ట‌. ఇక అనిల్ రావిపూడికి, దేవీకి మధ్య కూడా విబేధాలు నడుస్తున్నట్లు ఫిలింనగర్‌లో జోరుగా పుకార్లు నడుస్తున్నాయి. ఓ వైపు కొత్త ద‌ర్శ‌కుల జోరు… మ‌రోవైపు త‌న బిహేవియ‌ర్‌తో చాలా మంది టాప్ ద‌ర్శ‌కులు, టాప్ హీరోల‌కు అత‌డు దూర‌మైపోతోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోందంటున్నారు. మ‌రి దేవి మార‌తాడో ? లేదో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version