ఒమిక్రాన్ : కేంద్రం అల‌ర్ట్ కాల్ ? ఎందుకంటే!

-

దేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. రోజుకు మూడు లక్షల కేసుల కన్నా ఎక్కువగా వస్తున్నాయి. థర్డ్ వేవ్ ప్రకంపనలు రేపుతోంది. నెల క్రితం రోజుకు కేవలం 10 వేల లోపే ఉండే కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. మరోవైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో 10 వేలకు పైగా కేసులు నమోదువున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వస్తున్న కేసుల్లో అనధికారికంగా ఓమిక్రాన్ వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే రెండో వేవ్ లాగా దేశంలో ఎక్కువగా మరణాలు నమోదు కాకపోవడం సంతోషించాల్సిన విషయం.

మరో వైపు ఓమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి దశలో ఉందని కేంద్రం వెల్లడించింది. మెట్రోనగరాల్లో ఎక్కువగా సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉందని ఇండియా సార్స్ కోవ్ 2 జినోమిక్ సీక్వెన్సింగ్ కన్సార్టియం వెల్లడించింది. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో ఓమిక్రాన్ వేరియంట్ కేసులే అధికంగా ఉంటున్నాయని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version