విరాట్ కోహ్లీతో కేసీఆర్ పోలిక.. మంత్రి కొండా సురేఖ ఫైర్

-

నిన్న జరిగిన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచులో భారత్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి వచ్చి సెంచరీ చేశాడు. అంతేకాకుండా వన్డేల్లో 51వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 14వేల పరుగులు సైతం పూర్తి చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

తాజాగా దీనిపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ లాగా కేసీఆర్ కూడా సరికొత్త రికార్డు నెలకొల్పాడని సెటైర్లు వేశారు.దాదాపు 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కొత్త రికార్డ్ సాధించారని విమర్శించారు.ప్రజాసమస్యలపై స్పందించకుండా.. ప్రజలకి అందుబాటులో లేకుండా దేశ రాజకీయ చరిత్రలో ఇదొక పెద్ద రికార్డ్ అని వ్యంగాస్త్రాలు విసిరారు.14 వేల రన్నులు చేసిన కోహ్లీ ఓవైపు వార్తల్లో పతాక శీర్షికలలో నిలిస్తే.. 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని మన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా?అని సంచలన విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news