డెక్కన్ మాల్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం

-

హైదరాబాద్ నగరంలోని భవనాల్లో అగ్నిప్రమాద ఘటనలపై బీఆర్కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో డెక్కన్ మాల్‌లో గల్లంతైన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ముగ్గురు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

అక్రమ భవనాలపై చర్యలకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఈ కమిటీ అగ్నిప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు సూచించనుంది. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంతే కాకుండా అగ్నిమాపక శాఖకు భారీగా నిధుల కేటాయించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లోనే అధికంగా నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు సమచాారం. మరోవైపు అగ్నిమాపక శాఖకు ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణలు చేయాలని కూడా నిర్ణయించారు. భాగ్యనగరంతోపాటు శివారు కార్పొరేషన్లో అగ్నిమాపక సెల్ఫ్ సర్టిఫికెట్ ప్రోగ్రాం అమలు చేయనున్నట్లు మంత్రులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version