వాన దేవుడి పై కలెక్టర్ కు ఫిర్యాదు.. కారణం తెలిస్తే నవ్వుతారు..!

-

దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి…కొన్ని ప్రాంతాలలో అసలు వర్షాలు లేవు..అయితే వర్షాల కోసం పూజలు చేయడం మనం చూసే ఉంటారు..కానీ ఇలా వాన దేవుడు మీద అధికారులకు ఫిర్యాదు చేయడం ఎప్పుడైనా..ఎక్కడైనా చుసారా..ఓ వ్యక్తి వర్షాలు కురవడం లేదని ఆ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం పై ఇప్పుడు అనేక చర్చలు జరుగుతున్నాయి..

విషయాన్నికొస్తే.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వరుణుడికి ఆ విధంగా ఆదేశాలిచ్చేలా ఇంద్రుడిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. సదరు అధికారి కూడా ఆ లేఖపై స్పందించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని ఝాలా గ్రామానికి చెందిన సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు వర్షాల కురవక పోవడంపై అసంతృప్తికి గురయ్యాడు. దీనిపై ఫిర్యాదు చేయాలనుకున్నాడు. వర్షాల పడకపోవడానికి వరుణుడే కారణమని, ఆయన్ని తిడుతూ ఓ లేఖ రాశాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నాడు. ఆ లెటర్‌ని అక్కడ ప్రతి శనివారం నిర్వహించే “సమాధాన్ దివాస్” అనే కార్యక్రమంలో అధికారులను అందించాడు.. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉందని, కొన్ని నెలలుగా ఇక్కడ వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను.

కరువు, కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి వల్ల జంతువులు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నామని చెప్పారు.దాన్ని కాస్త కలెక్టర్ దగ్గరకు వెళ్ళింది.ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో రెవెన్యూ అధికారి వర్మ చిక్కుల్లో పడ్డారు.కలెక్టర్ దీన్ని కొట్టి పడేశాడు.. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version