కేసీఆర్ ఆట మొదలు…కన్ఫ్యూజ్ చేసేస్తున్నారుగా..

-

రాజకీయంగా కే‌సి‌ఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో…రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రత్యర్ధులని చిత్తు చేసే వ్యూహాలు పన్నడంలో కే‌సి‌ఆర్ ధిట్ట. అలాగే తనకు ఏదైనా నెగిటివ్ పెరుగుతూ, ప్రత్యర్ధులు పికప్ అవుతున్నారుకునే సమయంలో ఊహించని స్ట్రాటజీలతో ముందుకొచ్చి, రాజకీయాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కే‌సి‌ఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

cm kcr | సీఎం కేసీఆర్

ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఊహించని రీతిలో పుంజుకున్న విషయం తెలిసిందే. అటు బి‌జే‌పి గానీ, ఇటు కాంగ్రెస్ గానీ టి‌ఆర్‌ఎస్‌కు ధీటుగా వచ్చేస్తున్నాయి. ఇక టి‌ఆర్‌ఎస్‌పై నిదానంగా వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో కే‌సి‌ఆర్ ఢిల్లీ తూర్ పెట్టుకుని, తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరతీశారు. మామూలుగా సి‌ఎంలు, పి‌ఎంని కలుస్తూ ఉంటారు. రాజ్యాంగబద్ధమైన అంశాలని మాట్లాడుకుంటూ ఉంటారు.

కే‌సి‌ఆర్ సైతం ఢిల్లీకి వెళ్ళి…ప్రధాని మోడీని కలిశారు. అలాగే వరుసపెట్టి కేంద్ర మంత్రులని కలుస్తున్నారు. దీని కంటే ముందు ఢిల్లీలో టి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యలయం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అయితే కే‌సి‌ఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళిన ఎక్కువ రోజులు ఉండరు. కానీ ఈ సారి ఎక్కువ రోజులు ఢిల్లీలో స్పెండ్ చేస్తున్నారు. ఇలా ఢిల్లీ పర్యటనలో కే‌సి‌ఆర్ ఉండటంతో, బి‌జే‌పికి దగ్గరవుతున్నారని ప్రచారం మొదలైంది. రెండోసారి అధికారంలో కొనసాగుతున్న మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన ప్రాంతీయ పార్టీల మద్ధతు తీసుకోవాలని బి‌జే‌పి చూస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బి‌జే‌పి, కే‌సి‌ఆర్‌ని దగ్గర చేసుకోవాలని చూస్తోందని ప్రచారం జరుగుతుంది.

ఇటు కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పితో కలిస్తే తమకు బెనిఫిట్ అవుతుందనే కోణంలో రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా కేంద్రంలో బి‌జే‌పి, కే‌సి‌ఆర్ చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం తెలంగాణలో ఉన్న బి‌జే‌పి నేతలకు పెద్ద తలనొప్పిగా తయారైంది.   ఇక్కడేమో తాము కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై పోరాడుతుంటే అక్కడ కేంద్ర పెద్దలు సఖ్యతతో ఉండటం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ఎలాగో…కే‌సి‌ఆర్-బి‌జే‌పిలు ఒకటే అని ప్రచారం చేస్తున్నాయి. కానీ బి‌జే‌పి ఏమో….కాంగ్రెస్-టి‌ఆర్‌ఎస్‌లు ఒకటి అని కౌంటర్లు ఇస్తుంది. మొత్తానికి ఇలా తెలంగాణలో కన్ఫ్యూజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version