సీనియర్లను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.. ఆ నేతల మధ్య ఆసక్తికర చర్చ

-

ముందు నుంచి ఉండి పనిచేసిన వారిని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ నేత రవీందర్ రెడ్డి మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి.

‘ముందు నుంచి ఉన్న సీనియర్ నాయకులను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పటించుకోవడం లేదు.డబ్బులు ఉన్నోళ్లకే అవకాశాలు ఇస్తున్నారు. మనం ఎవరి కోసం పని చేస్తున్నామో అర్థం అవ్వడం లేదు. పార్టీల బలోపేతం కోసం నిరంతరం పని చేసినా, మనల్ని గడ్డిపోచలా తీసేశారు. మనల్ని కాదని మరొకరికి ప్రయార్టీ ఇచ్చారంటూ’ ఇద్దరి మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news